పారదర్శకంగా ఎన్నికలు జరపాలి
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:39 PM
గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు కోరారు.
ఎన్నికల అధికారులు
సిబ్బందికి శిక్షణ
ఆదోని రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు కోరారు. శనివారం ఎంపీపీ భవనలో ఆర్‌వో, ఏఆర్‌వో, సచివాలయ సిబ్బందికి నామినేషన ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. ఎంపీడీవో నాగరాజు స్వామి మాట్లాడుతూ రెండు మండలాలకు కలిపి 17మంది ఆర్‌ఓలను, 21మంది ఏఆర్‌ఓలను, ప్రతి నామినేషన కేంద్రం వద్ద ఐదుమంది సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. తప్పనిసరిగా హెల్ప్‌డె్‌స్కలను ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు నామినేషన పత్రాలను ఆనలైనలో పొందుపర్చాలని వారు తెలిపారు. తప్పనిసరిగా మూడురోజులపాటు ఉ దయం 10: 30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు తీసుకోవాలన్నారు. ఈనెల 18న నామినేషన్ల పరిశీలన, 19న అప్పీల్ , 20న ఆర్డీవో క్లియరెన్స, 21న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ తదనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నామన్నారు. 26న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ ఉంటుందని, రెండు గంటల తరువాత కౌంటింగ్ చేపట్టనున్నామన్నారు.
డ్రోన కెమెరాలతో..
నామినేషన కేంద్రాల వద్ద డ్రోన కెమెరాలతో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు రూరల్ సీఐ నల్లప్ప తెలిపారు. నేటి నుంచి సర్పంచ ఎన్నికలు ప్రారంభం కావడంతో శనివారం రాత్రి ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో పోలీస్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మక నామినేషన కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడతామన్నారు.