Election Commission: ఓటర్ల అవగాహనపై జాతీయ మీడియా అవార్డులు
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:18 AM
ఓటర్ల చైతన్యం, అవగాహన పెంపొందించడంలో విశేష కృషి చేసిన మీడియా సంస్థలకు జాతీయ మీడియా అవార్డులు-2025 అందించేందుకు...
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఓటర్ల చైతన్యం, అవగాహన పెంపొందించడంలో విశేష కృషి చేసిన మీడియా సంస్థలకు జాతీయ మీడియా అవార్డులు-2025 అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంట్రీలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎంట్రీలను ఈ నెల 10లోగా పంపాలి. ఎంట్రీలను... బ్రజేశ్ కుమార్, అండర్ సెక్రటరీ(కమ్యూనికేషన్), ఎలక్షన్ కమిషన్ ’ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోకా రోడ్డు, న్యూఢిల్లీ-110001 అన్న చిరునామాకు పంపాలి. ఈ మెయిల్ ఐడీ mediadivision@eci.gov.in అని వివేక్ యాదవ్ తెలిపారు.