ఎల్‌నినోతో అనూహ్యంగా భారీ వర్షం
ABN , Publish Date - May 31 , 2026 | 05:24 AM
ఎన్‌నినో ప్రభావంతో అనూహ్యంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
వర్షపు నీటిని చెరువుల్లో నింపేలా కార్యాచరణ చేపట్టాలి.. నిమ్మల ఆదేశం
అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): ఎన్‌నినో ప్రభావంతో అనూహ్యంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. జలధారపై మంత్రి నిమ్మల, సీఎం కార్యదర్శి రాజమౌళి, జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ శశిభూషణ్‌కుమార్, జలధార ప్రత్యేక అధికారి ప్రశాంతి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జలధార కార్యక్రమంలో రూ.3,200 కోట్లతో 94,000 చెరువులను నీటి నిల్వ చేసేందుకు సిద్ధం చేయాలని నిర్ణయించారు. చెరువులన్నీ పూడిక తీసి నీటి నిల్వకు సిద్ధంచేయాలని నిర్ణయించారు.