Share News

ఉద్యాన పంటల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:43 PM

కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ ఏ.సిరి అన్నారు.

    ఉద్యాన పంటల అభివృద్ధికి కృషి
ట్రాక్టర్‌ ర్యాలీని కలెక్టరేట్‌ వద్ద ప్రారంభిస్తున్న కలెక్టర్‌ డా.సిరి

కలెక్టర్‌ ఏ.సిరి

కర్నూలు అగ్రికల్చర్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ ఏ.సిరి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి సి.క్యాంపు రైతుబజార్‌ వరకు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభిం చారు. ఆమె మాట్లాడుతూ రూ.లక్ష కోట్లతో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ - రాయలజీమ రైజింగ్‌ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన, నీటి వనరులు, రోడ్లు వాటిని పెద్దఎత్తున చేపట్టేందుకు ప్ర భుత్వం కృషిచేస్తుందన్నారు. అక్టోబరు 2న అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తున్నారని తెలిపారు. దీని అమలుపై కొన్నిరోజులుగా రైతులకు, ప్రజలకు వివిధ రూపాల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కర్నూలు జిల్లాకు సుమారు రూ.4,191 కోట్లు మంజూరవుతాయని, ఇందులో సాగునీటి సం ఘానికి రూ.2వేలు కోట్లు కేటాయించారన్నారు. ఈ ర్యాలీలో జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ, ఇరిగేషన ఎస్‌ఈ శైలేశ్వర్‌, హార్టికల్చర్‌ అధికారి రాజాకృష్ణారెడ్డి, మైక్రో ఇరిగేషన ఏపీడీ ఫిరోజ్‌, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:44 PM