రైతు సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:53 PM
రైతుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఆదోని ఎమ్మెల్యే పార్థసారఽథి అన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన
మాట తప్పదు
ఎమ్మెల్యే పార్థసారఽథి
అట్టహాసంగా ‘అన్నదాత సుఖీభవ’
ఆదోని రూరల్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : రైతుల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఆదోని ఎమ్మెల్యే పార్థసారఽథి అన్నారు. 3వ విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం విరూపాపురంలో ఏడీఏ బాలవర్థిరాజు, ఏవో సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 18722 మంది రైతులకు రూ.10కోట్ల 38లక్షలు అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందన్నారు. ముఖ్యంగా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్, తల్లికి వందనం, ఉచిత బస్సుతోపాటు పింఛన కూడా పెంచి ప్రజల పక్షాన తమ ప్రభుత్వం నిలబడిందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన రాష్ర్టాన్ని అతలాకుతలం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి ప్రభుత్వమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులు కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ పంటను ఈక్రాప్ బుక్ చేసుకోవాలని సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్ తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో నాగరాజు స్వామి, తహసీల్దార్ శేషఫణి, తాలూకా సీఐ నల్లప్ప, ఎస్‌ఐ రామాంజనేయులు, సర్పంచ ప్రహ్లాద్, కునిగిరి నీలకంఠ, వీరే్‌ష,బెస్త కార్పొరేషన డైరెక్టర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రోటోకాల్ వివాదం
అన్నదాత సుఖీభవ 3వ విడత చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. సభ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఫొటో లేకపోవడంతో ఆయనతోపాటు అనుచరులు ఆవేద న వ్యక్తం చేశారు. విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని బీటీ నాయుడు అనుచరులతో అన్నట్లు సమాచారం.
రైతుల ప్రభుత్వం
వెల్దుర్తి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ ప్రభుత్వమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. శుక్రవారం మండలంలో మల్లెపల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ ఆధ్వర్యంలో ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులకు సంబంధించి ‘ మెగా చెక్కు’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ నియోజవకర్గం మొత్తం 55వేల మంది రైతులకు రూ.32 కోట్లు నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారని అన్నారు. వెల్దుర్తి మండలానికి రూ.6కోట్లు మంజూరైట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ మాట్లాడుతూ మూడో విడతలో జిల్లాకు రూ.154 కోట్లు 2.76లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయబడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్బారాయుడు, జ్ఞానేశ్వర్‌గౌడు, రమాకాంతరెడ్డి, రమణరెడ్డి, ఈదుల వెంకటరాముడు, మండల వ్యవసాయ అధికారి అక్బర్‌బాషా, ఉద్యానశాఖ అధికారి నరేశకుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి పెద్దపీట
ఆస్పరి: కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏడీఏ చెంగలరాయుడు ఆధ్వర్యంలో 2025-2026 మూడో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ రైతన్న నీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతులను పట్టించుకోకుండా రైతులను విస్మరించాడన్నారు. నేడు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ ద్వారా నిధులను అందించి ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. ఆలూరు నియోజకవర్గంలో 63,317 మంది రైతులకు గానూ రూ.35 కోట్ల 80 లక్షలు ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు వైకుంఠం శ్రీరాములు, కురువ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఉదయ్‌కుమార్, మాజీ ఎంపీటీస సభ్యులు కృష్ణయాదవ్, సొసైటీ చైర్మన్ రత్నమ్మ, డైరెక్టర్లు సంజన్న, మల్లికార్జున, టీడీపీ, జనసేన మండలాల కన్వీనర్లు గోవిందు, అరవింద్, సహాయ కార్యదర్శి శేషాద్రి, కూటమి నాయకులు జీవన్‌కుమార్, నర్సిరెడ్డి, రాఘవేంద్ర, కృష్ణ, రవిప్రకా ష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.