విద్యనే జీవితాన్ని మార్చేస్తుంది: డీఎస్పీ
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:21 PM
అంకితభావం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో కూడిన విద్య జీవితాలనే మార్చేస్తుందని, విద్యార్థులు ఆ దిశగా పయనం సాగించాలని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య సూచించారు.
పత్తికొండ టౌన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): అంకితభావం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో కూడిన విద్య జీవితాలనే మార్చేస్తుందని, విద్యార్థులు ఆ దిశగా పయనం సాగించాలని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య సూచించారు. ఆదివారం స్థానిక సాయిబాబా ధ్యాన మందిరంలో వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ వెంకటరామయ్య మాట్లాడుతూ విద్య అనేది చాలా ప్రాముఖ్యతతో కూడినదన్నారు. ఇంటర్ దశలో విద్యార్థినీ, విద్యార్థులు చెడు, దుర అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో విద్యపై దృష్టి సారించి ముందుకు సాగితే భవిష్యత్‌లో ఉన్నతమైన జీవితాన్ని పొందవచ్చునన్నారు. అనంతరం డీఎస్పీ వెంకటరామయ్యను వాల్మీకి ఉద్యోగ సంఘం నాయకులు సాయిబాబా, రమేష్ సత్కరించారు. అలాగే జిల్లాలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వాల్మీకి ఉద్యోగ సంఘం నాయకులు గంగాధర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాయకులు బాల వెంకటేశ్వర్లు, శివయ్య, షైనింగ్ టీచర్ కళ్యాణి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వనిత, ఉద్యోగ సంఘం నాయకులు సాయిబాబా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.