Share News

విద్యావ్యవస్థలో సమగ్ర మార్పులు రావాలి

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:03 AM

దేశవ్యాప్తంగా విద్యావ్యవస్ధలో సమూల మార్పులు అవసరమని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఐసా) జాతీయ అధ్యక్షురాలు, జెన్‌-జీ ఉద్యమ నేత నేహా బోరా పేర్కొన్నారు.

విద్యావ్యవస్థలో సమగ్ర మార్పులు రావాలి

  • విద్యార్ధుల పట్ల నిర్లక్ష్య వైఖరితోనే ప్రభుత్వానికి చిక్కులు

  • ఐసా జాతీయ అధ్యక్షురాలు, జెన్‌-జీ ఉద్యమ నేత నేహా బోరా

విజయవాడ (గాంధీనగర్‌), ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా విద్యావ్యవస్ధలో సమూల మార్పులు అవసరమని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఐసా) జాతీయ అధ్యక్షురాలు, జెన్‌-జీ ఉద్యమ నేత నేహా బోరా పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఆమె మాట్లాడారు. నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌, పరీక్ష రద్దు వంటి ఆంశాల కంటే ప్రభుత్వం బాధ్యతగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని విద్యార్ధుల డిమాండ్లపై నిర్లక్ష్యంతోనే మోదీ ప్రభుత్వం చిక్కుల్లో పడిందన్నారు. జంతర్‌ మంతర్‌లో నిరాహారదీక్షలో ఉన్న తమపై విద్వేషం రెచ్చగొట్టాలని ప్రయత్నించారని, సమస్యలపై స్పందించలేదన్నారు. 60 ఏళ్ల వాంగ్‌చుక్‌కు వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీలేవని కేవలం విద్యార్ధులకు న్యాయం జరగాలనే ఆయన దీక్ష చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు కూన అజయ్‌బాబు, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్‌ అధ్యక్షుడు చావా రవి, ఐజేయూ కౌన్సిల్‌ సభ్యుడు ఎస్‌కే.బాబు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 04:05 AM