Share News

చదువుతోనే మహిళల్లో చైతన్యం: డీఎస్పీ

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:36 PM

మహిళల్లో చైతన్యం రావాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య అన్నారు.

చదువుతోనే మహిళల్లో చైతన్యం: డీఎస్పీ
సమావేశంలో మాట్లాడుతున్న పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య

హాలహర్వి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): మహిళల్లో చైతన్యం రావాలంటే చదువుతోనే సాధ్యమవుతుందని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య అన్నారు. మంగళవారం గూళ్యం గ్రామంలో ‘మహిళా సంరక్షణ చట్టాలు’పై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ పాల్గొని మాట్లాడారు. మహిళల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకువచ్చాయన్నారు. వారికి సహాయం అందించడానికి హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే అండగా పోలీసుశాఖ అందుబాటులో ఉంటుందన్నారు. మహిళలు సైతం చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇందుకు ప్రతి మహిళ చదువుకోవాలన్నారు. మహిళలు ఎదుగుదలకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. సమావేశంలో ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, హాలహర్వి ఎస్‌ఐ ఈశ్వరరావు, సొసైటీ చైర్మన్‌ ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 11:36 PM