‘ఆంధ్రజ్యోతి-ఐఆర్‌ఎంఎస్’ ఎడ్యుకేషన్ ఎక్స్‌పోకు విశేష స్పందన
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:54 AM
ఆంధ్రజ్యోతి-ఐఆర్‌ఎంఎస్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్‌పోకు విశేష స్పందన లభిస్తోంది.
విజయవాడ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి-ఐఆర్‌ఎంఎస్’ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్‌పోకు విశేష స్పందన లభిస్తోంది. రెండు రోజులు జరిగే ఈ ఎక్స్‌పోను శుక్రవారం పలువురు విద్యారంగ ప్రముఖులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ తర్వాత ఏయే కోర్సులు చేయాలి, ఏ కోర్సులకు డిమాండ్ ఉంది.. అనే విషయాలను విద్యాసంస్థల ప్రతినిధులతో మాట్లాడి తెలుసుకున్నారు. విద్యార్థులు తాము ఏయే కోర్సులు చేయాలి, ఏ కోర్సులకు ఎంత వ్యవధి, ఎంత మొత్తంలో ఖర్చవుతుంది. క్యాంపస్, ప్యాకేజీ వంటి అనుమానాలను నిర్వాహకులను అడిగి నివృత్తి చేసుకున్నారు. దక్షిణ భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, కళాశాలలు, కన్సల్టెన్సీలు పాల్గొని విద్యార్థుల భవితకు మంచి మార్గాన్ని చూపించాయి.