Share News

డమ్మీ కంపెనీలతో జగన్‌ ఇసుక దోపిడీ

ABN , Publish Date - Jul 16 , 2026 | 04:35 AM

జగన్‌ హయాంలో జరిగిన ఇసుక అక్రమ దందాపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు బుధవారం సామాజిక కార్యకర్త నాగేంద్రకుమార్‌ను సుదీర్ఘంగా 8 గంటలు హైదరాబాద్‌లో..

డమ్మీ కంపెనీలతో జగన్‌ ఇసుక దోపిడీ

  • ఇసుక అక్రమాలపై ఈడీకి ఆధారాలు అందజేసిన నాగేంద్ర

హైదరాబాద్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో జరిగిన ఇసుక అక్రమ దందాపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు బుధవారం సామాజిక కార్యకర్త నాగేంద్రకుమార్‌ను సుదీర్ఘంగా 8 గంటలు హైదరాబాద్‌లో సాక్షిగా విచారించారు. నాడు జిల్లాల వారీగా కాంట్రాక్టు సంస్థలు ఎంత మైనింగ్‌ జరిపాయి.. అనుమతులకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని ఆయన ఈ సందర్భంగా అందజేశారు. తమ వద్ద ఉన్న సమాచారంతో ఆ డేటాను ఈడీ అధికారులు సరిపోల్చుకున్నారని నాగేంద్ర అనంతరం మీడియాకు తెలిపారు. జగన్‌ సీఎంగా ఉన్నపుడు డమ్మీ కంపెనీలు ఏర్పాటు చేసి ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని.. ప్రతిమ ఇన్‌ఫ్రా, జేపీ వెంచర్స్‌, జీసీకేసీ, టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ల సాయంతో ఇసుక డబ్బు దోచుకున్నారని ఆరోపించారు. గూగుల్‌ ఎర్త్‌లో అన్నీ రికార్డయ్యాయని, నిజాలు త్వరలోనే బయటపడతాయని తెలిపారు. ఇసుక దందాలో ఎవరెవరి పాత్ర ఏ స్థాయిలో ఉందో ఈడీ వద్ద ఇప్పటికే పక్కా సమాచారం ఉందని, కేసును ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన మరికొన్ని డాక్యుమెంట్లను తన వద్ద తీసుకున్నారని ఆయన చెప్పారు.

Updated Date - Jul 16 , 2026 | 04:36 AM