ఈడీ క్లీన్‌చిట్ చంద్రబాబు నిజాయితీకి నిదర్శనం: అచ్చెన్న
ABN , Publish Date - Feb 02 , 2026 | 03:51 AM
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ క్లీన్‌చిట్ ఇవ్వడం ఆయన నిజాయితీకి నిదర్శనమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ క్లీన్‌చిట్ ఇవ్వడం ఆయన నిజాయితీకి నిదర్శనమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం అచ్చెన్న ఓ ప్రకటన చేశారు. ‘సత్యం, న్యాయం మీద నిలబడే నాయకుడు సీఎం చంద్రబాబు. ఆయనకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సంబంధం లేదని ఈడీ చార్జ్‌షీట్‌లో స్పష్టం చేయడం ఆయన స్వచ్ఛమైన రాజకీయాలకు గుర్తింపు. కక్ష రాజకీయాలకు భయపడని, చట్టానికి గౌరవం ఇచ్చే ధైర్యవంతమైన నాయకత్వం చంద్రబాబుది. యువత భవిష్యత్ కోసం పెట్టిన స్కిల్ డెవల్‌పమెంట్ చంద్రబాబు దూరదృష్టికి, పాలనాదక్షతకు తార్కాణం. ఏపీ సీఐడీ, ఈడీ రెండూ చంద్రబాబు పాత్ర లేవని తేల్చడం ఆయన నిజాయితీకి నిదర్శనం. విలువలతో కూడిన రాజకీయాలు చేయవచ్చని నిరూపించిన అరుదైన నాయకుడు చంద్రబాబు. కక్ష సాధింపు రాజకీయాలు చేసినా, చివరకు గెలిచేది సత్యమే. అదే చంద్రబాబు మార్గం. వ్యక్తిగత దూషణలకు లొంగకుండా ముందుకు నడిచే నేత చంద్రబాబు. ఆయన నాయకత్వంపై ప్రజల నమ్మకాన్ని ఈడీ క్లీన్‌చిట్ మరింత బలపర్చిందని’ అని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.