ముందస్తు సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:07 AM
పట్టణ శివారులోని గేట్స్ కళాశాల ఆవరణంలో సోమవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
గుత్తి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులోని గేట్స్ కళాశాల ఆవరణంలో సోమవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు విద్యార్థులు, ఆధ్యాపకులు సంప్రదాయ దుస్తులతో హాజరయ్యారు. ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఇందులో కళాశాల కరస్పాండెంట్ పద్మావతమ్మ, ప్రిన్సిపాల్ నమ్రత పాల్గొన్నారు.