Share News

22న ఈఏపీసెట్‌ ఫలితాలు!

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:21 AM

ఈఏపీసెట్‌ ఫలితాలు ఈ నెల 22న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గురువారం విడుదలైన ఇంటర్‌ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ ఫలితాలు వెంటనే ఉన్నత విద్యామండలికి చేరాయి.

22న ఈఏపీసెట్‌ ఫలితాలు!

  • ఇంటర్‌ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ ఫలితాల విడుదలతో ప్రక్రియ వేగం

అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఈఏపీసెట్‌ ఫలితాలు ఈ నెల 22న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గురువారం విడుదలైన ఇంటర్‌ సప్లిమెంటరీ, బెటర్‌మెంట్‌ ఫలితాలు వెంటనే ఉన్నత విద్యామండలికి చేరాయి. వాటిని ఈఏపీసెట్‌ కన్వీనర్‌కు మండలి పంపింది. షెడ్యూలు ప్రకారం ఈ నెల 1నే విడుదల కావాల్సిన ఈఏపీసెట్‌ ఫలితాలు.. ఇప్పటి వరకు సెకండియర్‌ బెటర్‌మెంట్‌ ఫలితాల కోసం నిలిచిపోయాయి. ఈ ఏడాది తొలిసారిగా ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు బెటర్‌మెంట్‌ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 19 , 2026 | 04:23 AM