Share News

ఫీజు కడితేనే అడ్మిషన్‌

ABN , Publish Date - Aug 15 , 2026 | 04:54 AM

ఈఏపీసెట్‌లో ర్యాంకులు సాధించి కన్వీనర్‌ కోటా సీ ట్లు పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో అడ్మిషన్లు ఇ చ్చేందుకు కాలేజీలు రకరకాలుగా డబ్బులు గుంజుతున్నాయి.

ఫీజు కడితేనే అడ్మిషన్‌

  • కన్వీనర్‌ కోటాకు ఇంజనీరింగ్‌ కాలేజీల డిమాండ్‌

  • హాస్టల్‌, డొనేషన్‌, బస్‌ ఫీజు పేరుతో దోపిడీ

  • ట్యూషన్‌ ఫీజులోనూ కొంత కట్టాల్సిందే

  • లేకుంటే అడ్మిషన్లు ఇవ్వబోమంటున్న యాజమాన్యాలు

  • ప్రభుత్వం సకాలంలో ఇవ్వడం లేదని ముందే కట్టించుకుంటున్న వైనం

  • విద్యార్థులు, తల్లిదండ్రులపై భారం

‘ముందు లక్ష కట్టండి. ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ కింద ఫీజు వేసిన తర్వాత మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం. అలా అయితేనే కన్వీనర్‌ కోటాలో

ఇంజనీరింగ్‌లో చేరేందుకు అడ్మిషన్‌ ఇస్తాం’.. అమరావతిలోని ఓ ప్రముఖ విద్యా సంస్థ ఒక విద్యార్థికి తేల్చిచెప్పిన మాట ఇది.

‘మా కాలేజీలో చేరాలంటే కచ్చితంగా ఆరు నెలలైనా హాస్టల్‌లో ఉండాల్సిందే. అందుకోసం రూ.90 వేలు, బస్‌ చార్జ్‌ ఏడాదికి రూ.30 వేలు ముందుగా కడితేనే అడ్మిషన్‌.. లేదంటే సీటు లేదు’.. అంటూ కాకినాడలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ షరతు పెడుతోంది.

‘మా కాలేజీలో చేరాలంటే డొనేషన్‌ రూ.10 వేలు కట్టాలి. మిగిలిన ఖర్చుల గురించి తర్వాత చెప్తాం’.. అని గుంటూరులోని ఓ కాలేజీ వసూళ్లు చేస్తోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఈఏపీసెట్‌లో ర్యాంకులు సాధించి కన్వీనర్‌ కోటా సీ ట్లు పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో అడ్మిషన్లు ఇ చ్చేందుకు కాలేజీలు రకరకాలుగా డబ్బులు గుంజుతున్నాయి. కాస్త ఫరవాలేదనుకున్న కాలేజీల నుంచి పేరు న్న విద్యా సంస్థల్లో చాలా వరకు ఇలాంటి దోపిడీనే కనిపిస్తోంది. ఒక్క బోధన(ట్యూషన్‌) ఫీజు మినహాయిస్తే మిగిలిన ఫీజులన్నీ తాము చెప్పినట్టు కట్టాలని, లేనిపక్షంలో కన్వీనర్‌ కోటాలో సీటు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. దీంతో విద్యార్థులు ఇన్ని రకాల ఫీజులు కట్టేట్టయితే కన్వీనర్‌ కోటాలో సీటు సాధించడం ఎందుక ని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో తమకు సంబంధం లేదని తమ రూల్స్‌ ప్రకారం ఫీజులు కడితేనే అడ్మిషన్లు ఇస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి.


ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నా..

కన్వీనర్‌ కోటా సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజులు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యార్థులకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌లో అలాట్‌మెంట్‌ లెటర్లు జారీ చేశారు. దానిలో సీటు పొందిన కాలేజీ ఫీజు ఎంతో చూపించారు. అలాగే విద్యార్థులు చెల్లించాల్సింది ‘0’ అని రాశారు. అయితే ప్రభుత్వం ఫీజులు ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియదని, అందువల్ల మొదట కొంత కడితేనే కన్వీనర్‌ కోటా కింద అలాట్‌ చేసిన సీటును ధ్రువీకరిస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఓ కాలేజీలో ఫీజు రూ.80 వేలు అయితే కనీసం రూ.20 నుంచి 30 వేలు కట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత రీయింబర్స్‌మెంట్‌ జమైతే తిరిగి ఇస్తామని చెబుతున్నా ఆ పరిస్థితి ఉండదని విద్యార్థులు వాపోతున్నారు.

సీటు వదులుకోలేక...

ఈ ఏడాది కన్వీనర్‌ కోటా తొలిదశలో 1,07,839 మంది కి ఉన్నత విద్యాశాఖ సీట్లు కేటాయించింది. వారిలో 97,193 మంది ఆన్‌లైన్‌లో రిపోర్ట్‌ చేయగా, 92,421 మం దికి సీట్లు ఇచ్చామని కాలేజీలు రిపోర్ట్‌చేశాయి. సుమారు 15 వేల మంది ఇంకా చేరాల్సి ఉంది. చేరిన వారిలో చా లామంది ఎంతోకొంత నగదు చెల్లించి సీట్లు తీసుకున్నా రు. ప్రభుత్వం సకాలంలో ఫీజులు విడుదల చేయట్లేదనే కారణంతో ఈ సంస్కృతికి తెరతీశాయి. కొన్ని కాలేజీల్లో కట్టించుకున్న అదనపు ఫీజులు చూస్తే కన్వీనర్‌ కోటా నా? లేక మేనేజ్‌మెంట్‌ కోటానా? అనేలా ఉన్నాయి. కాగా, విద్యార్థుల ఇబ్బందులపై ఉన్నత విద్యాశాఖ పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప మిగిలిన కాలేజీలపై పర్యవేక్షణ కనిపించడం లేదు. పైగా ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకోవడం లేదు. ఇప్పటికైనా పరిస్థితిని అర్థంచేసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

అదనపు ఫీజు వసూలు చేసే విద్యా సంస్థలపై కఠి న చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ శుక్రవారం హెచ్చరించింది. ‘‘కన్వీనర్‌ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల నుంచి గేట్‌ కోచింగ్‌, విదేశీ భాషల శిక్షణ పేరుతో అదనపు ఫీజులు వసూలు చేయద్దు. అడ్మిషన్ల సమయంలోగానీ, కోర్సు పూర్తయిన తర్వాతగానీ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు నిలిపివేయకూడదు. సర్టిఫికెట్లను పరిశీలించి తిరిగి ఇచ్చేయా లి. ఉల్లంఘనలకు పాల్పడే సంస్థలకు జరిమానాలు విధించి, ఆ మొత్తాన్ని కాలేజీ ఎండోమెంట్‌ ఫండ్‌ నుంచి రికవరీ చేస్తాం. అవసరమైతే అఫిలియేషన్‌ను ఉపసంహరించుకుంటాం.’’ అని హెచ్చరించింది.

Updated Date - Aug 15 , 2026 | 04:55 AM