Share News

ఈగల్‌ టీం పిల్లలకు ఎక్సలెన్సీ అవార్డులు

ABN , Publish Date - May 31 , 2026 | 05:50 AM

ఇటీవల విడుదలైన 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరచిన ఈగల్‌ సర్వీస్‌ విభాగం అధికారులు, సిబ్బంది పిల్లలను ఈగల్‌ చీఫ్‌ రవికృష్ణ సత్కరించారు.

ఈగల్‌ టీం పిల్లలకు ఎక్సలెన్సీ అవార్డులు

  • ప్రతిభావంతులను సత్కరించిన చీఫ్‌ రవికృష్ణ

విజయవాడ సిటీ, మే 30(ఆంధ్రజ్యోతి): ఇటీవల విడుదలైన 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరచిన ఈగల్‌ సర్వీస్‌ విభాగం అధికారులు, సిబ్బంది పిల్లలను ఈగల్‌ చీఫ్‌ రవికృష్ణ సత్కరించారు. వారికి ఈగల్‌ అకడమిక్‌ ఎక్సలెన్సీ అవార్డులను అందజేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన ప్రతిభావంతులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. 10వ తరగతిలో 9 మంది, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో నలుగురు, ద్వితీయ సంవత్సరంలో ఐదుగురు విద్యార్థులు రవికృష్ణ చేతుల మీదుగా ఈగల్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌, జ్ఞాపికలను అందుకున్నారు. చదువుతోపాటు ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం పొందాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈగల్‌ విభాగం ఎస్పీలు కె.నగేష్ బాబు, ప్రభాకర్‌బాబు, జి.స్వరూపరాణి, అదనపు ఎస్పీ డి.బాలచంద్రారెడ్డి, డీఎస్పీలు టి.త్రినాథ్‌, కె.సింగయ్య, టి.దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2026 | 05:51 AM