సీఎంను కలిసిన ‘డైనమాటిక్’ ప్రతినిధులు
ABN , Publish Date - Feb 23 , 2026 | 03:59 AM
డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.
విమానయాన, రక్షణ ఉత్పత్తుల తయారీపై ప్రజంటేషన్
అమరావతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. విమానయాన రంగం, రక్షణ ఉత్పత్తుల తయారీలో తమ సంస్థ కార్యకలాపాలపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ సంస్థ చైర్మన్, సీఈవో ఉదయంత్ మల్హోత్రా, ఏరోస్పేస్ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పి.చలపతి, డైరెక్టర్ అహిల్యా మల్హోత్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రియా మిలానీ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టినా లిడేగార్డ్ తదితరులు ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. తమ ప్రభుత్వ విధానాలు, రక్షణ, విమానయాన రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా సీఎం వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.