Share News

29,662 కోట్లతో దుగరాజపట్నం ఎస్‌పీవీ

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:57 AM

దుగరాజపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం, భారీ పరిశ్రమల పార్కును ఏర్పాటు చేయడానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ) ఏర్పాటైంది.

29,662 కోట్లతో దుగరాజపట్నం ఎస్‌పీవీ

విశాఖపట్నం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): దుగరాజపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం, భారీ పరిశ్రమల పార్కును ఏర్పాటు చేయడానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ) ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మారీటైమ్‌ బోర్డు, విశాఖపట్నం పోర్టు సంయుక్త, సమ భాగస్వామ్యంతో ఈ ఎస్‌పీవీ ఏర్పాటైంది. ఈ రెండు సంస్థలు 50:50 నిష్పత్తిలో రూ.29,662 కోట్ల పెట్టుబడి పెడతాయి. నెల్లూరు జిల్లాలో రెండు వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వ్యూహాత్మక నౌకా నిర్మాణ భాగస్వామిని ఎంపిక చేస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో తీర ప్రాంత పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుంది.

Updated Date - Mar 06 , 2026 | 05:01 AM