Share News

అనారోగ్యంతో డీఎస్‌జీ పొన్నారావు మృతి

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:47 AM

కేంద్ర ప్రభుత్వం తరఫున ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించేందుకు 2024లో డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌(డీఎస్‌జీ)గా నియమితులైన పసల పొన్నారావు(47) సోమవారం అనారోగ్యంతో మరణించారు.

అనారోగ్యంతో డీఎస్‌జీ పొన్నారావు మృతి

అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తరఫున ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించేందుకు 2024లో డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌(డీఎస్‌జీ)గా నియమితులైన పసల పొన్నారావు(47) సోమవారం అనారోగ్యంతో మరణించారు. తాడేపల్లిలోని గృహం వద్ద పొన్నారావు మృతదేహాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టుదేవానంద్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనంజయ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, పలువురు న్యాయవాదులు సందర్శించి నివాళి అర్పించారు.

Updated Date - Apr 28 , 2026 | 04:48 AM