Share News

డీఎస్సీ నోటిఫికేషన విడుదల

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:17 AM

కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన ప్రకటించడం పట్ల నిరుద్యోగ యువతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది.

   డీఎస్సీ నోటిఫికేషన విడుదల

జిల్లాలో 404 పోస్టులు

స్కూల్‌ అసిస్టెంట్లు 183, ఎస్‌జీటీలు 221

కర్నూలు ఎడ్యుకేషన, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన ప్రకటించడం పట్ల నిరుద్యోగ యువతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. 2025లో మెగా డీఎస్సీ నోటిఫికేషనను విడుదల చేసి కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. ఈసారి కూడా కర్నూలు జిల్లాలోని అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో 389 పోస్టులు, 15 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను ప్రకటించింది. నవంబరు 3 నుంచి ఆనలైనలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు అర్హుల పూర్తి వివరాలను నోటిఫికేషనలో ప్రకటిస్తోంది. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో అత్యధిక ఉపాధ్యాయ 404 ఖాళీలు ఉన్నాయి. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లు 176, ఎస్‌జీటీలు 213 మొత్తం 389 ఉన్నాయి. అలాగే ప్రత్యేక ఉపాధ్యాయ స్కూల్‌ అసిస్టెంట్లు 7, ప్రత్యేక ఎస్‌జీటీలు 8లు కలిపి మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన ప్రకటించడంతో నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆనందంగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో 40వేల మందికి పైగా నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పటికే వివిధ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు.

Updated Date - Oct 15 , 2026 | 12:17 AM