Share News

వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:37 AM

అధికారంలో ఉండగా ఒక్క ఉపాధ్యాయ నియామకం కూడా చే పట్టని వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నాయకులు.. 2025-డీఎస్సీ నియామకాల గురించి చేస్తున్న అసత్యప్రచారంపై..

వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

  • డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు మౌనం వీడాలి

  • ఆత్మీయ సమావేశంలో వక్తల పిలుపు

ఉయ్యూరు, జూన్‌ 21(ఆంధ్ర జ్యోతి): అధికారంలో ఉండగా ఒక్క ఉపాధ్యాయ నియామకం కూడా చే పట్టని వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నాయకులు.. 2025-డీఎస్సీ నియామకాల గురించి చేస్తున్న అసత్యప్రచారంపై ఉపాధ్యాయులు మౌనం వీడాలని వక్తలు పిలుపునిచ్చారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. 2025-డీఎస్సీపై వైసీపీ అసత్యప్రచారం నేపథ్యంలో కృష్ణాజిల్లా తెలుగుయువత అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం ఉయ్యూరులో డీఎస్సీ-2025 ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడితే వైసీపీ నాయకులు బురద జల్లుతున్నారన్నారు. డీఎస్సీ నోటి ఫికేషన్‌ ముందే అడ్డంకులు సృష్టించడానికి జగన్‌ ఎన్నో కుట్రలు చేసారని చెప్పారు. డీఎస్సీ నిర్వహిస్తే చంద్రబాబు, లోకేశ్‌కు మంచి పేరొస్తుందనే అక్కసుతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. క్రీడా కోటా నియామకాలు నిబంధనల మేరకే జరిగాయన్నారు. నిరుద్యోగులెవరూ నిరసన తెలపలేదని, వైసీపీ నాయకులే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.


వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర కాపలాకు పంపిస్తే, కూటమి ప్రభుత్వం సింగపూర్‌ శిక్షణకు పంపిస్తోందని తెలిపారు. కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ క్రీడా రిజ ర్వేషన్‌పై కనీస అవగాహన లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడటం అవివేకమన్నారు. ఆరు లక్షల మంది పరీక్షలు రాస్తే 16 వేల మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల వేదికగా వైసీపీ అసత్యప్రచారం చేసిందని తెలిపారు. టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ వైసీపీ అసత్య ప్రచారాలను జనానికి తె లియజేయాలని ఉపాధ్యాయులను కోరారు. అనంతరం డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. యూటీఎఫ్‌, టీఎన్‌టీయూసీ, ఏపీటీఎఫ్‌, ఎస్టీయూ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 05:39 AM