Share News

డప్పు కళాకారులను ఆదుకోవాలి

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:25 AM

జిల్లాలో ని డప్పు కళాకారులను ఆదుకోవాలని కేవీపీఎస్‌ జిల్లా బాధ్యుడు ఏసురత్నమ్‌, జిల్లా నాయకులు కోరారు.

డప్పు కళాకారులను ఆదుకోవాలి
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న డప్పుకళాకారులు

నంద్యాల నూనెపల్లి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ని డప్పు కళాకారులను ఆదుకోవాలని కేవీపీఎస్‌ జిల్లా బాధ్యుడు ఏసురత్నమ్‌, జిల్లా నాయకులు కోరారు. సోమవారం వారు డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు రంగమ్మ అధ్యక్షతన కలెక్టరేట్‌ ఎదుట డప్పులు కొట్టుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డప్పు కళాకారులకు వయస్సుతో సంబంధం లేకుండా రూ.8 వేల పింఛన ఇవ్వాలన్నారు. డప్పు కళాకారులకు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఆఫీసును ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలలో జిల్లా నాయకులు నరసింహులు, హుసేనమ్మ, జయమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:25 AM