Share News

Road Accident: ప్రాణం తీసిన నిద్రమత్తు

ABN , Publish Date - Jan 01 , 2026 | 06:20 AM

నిద్ర మత్తు నిండు ప్రాణాన్ని బలిగొంది. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం రంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో నంద్యాల-ఒంగోలు జాతీయ...

Road Accident: ప్రాణం తీసిన నిద్రమత్తు

  • మినీవ్యాన్‌ డ్రైవర్‌ సజీవ దహనం, మరొకరికి గాయాలు

రాచర్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): నిద్ర మత్తు నిండు ప్రాణాన్ని బలిగొంది. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం రంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో నంద్యాల-ఒంగోలు జాతీయ రహదారిపై తుని నుంచి మినీవ్యాన్‌ అనంతపురం వెళ్తోంది. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు రంగారెడ్డిపల్లి సమీపంలోకి రాగానే డ్రైవర్‌ నిద్రమత్తులో ముందు వెళుతున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ ఎర్రి స్వామి(50) క్యాబిన్‌లో స్టీరింగ్‌, సీట్‌ మధ్యలో ఇరుక్కుని బయటపడే వీలు లేక సజీవ దహనమయ్యాడు. అతని పక్కనున్న యజమాని కన్నంపల్లి జయరామిరెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

Updated Date - Jan 01 , 2026 | 06:20 AM