Share News

Odisha Governor Kambhampati Haribabu: ద్రౌపది ముర్ము జీవితం స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:17 AM

మనోధైర్యాన్ని కోల్పోయి, జీవితాలను అర్ధంతరంగా ముగించుకుంటున్న యువతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ఆదర్శంగా నిలుస్తుందని ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు అన్నారు.....

Odisha Governor Kambhampati Haribabu:  ద్రౌపది ముర్ము జీవితం స్ఫూర్తిదాయకం

  • ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు

  • యార్లగడ్డ రచించిన ‘అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము’ పుస్తకం ఆవిష్కరణ

విజయవాడ, జనవరి 3(ఆంధ్రజ్యోతి) : మనోధైర్యాన్ని కోల్పోయి, జీవితాలను అర్ధంతరంగా ముగించుకుంటున్న యువతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ఆదర్శంగా నిలుస్తుందని ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు అన్నారు. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన ‘అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము’ పుస్తకావిష్కకరణ కార్యక్రమం విజయవాడ కృష్ణవేణి విద్యాసంస్థల ప్రాంగణంలో శనివారం జరిగింది. ఈ పుస్తకాన్ని హరిబాబు ఆవిష్కరించారు. కాగా, తనలోని రచయితను గుర్తించి, లోకానికి తెలియజేసిన నేత హరిబాబు అని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఎమెస్కో’ విజయకుమార్‌, ఢిల్లీ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 04:17 AM