Share News

నెల రోజులుగా తాగునీరు వృథా

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:20 AM

మండలం లోని కత్తేకొట్టాల గ్రామంలో పంచాయతీ బోరు వద్ద లీకేజీ వల్ల నెల రోజులుగా తాగునీరు ఇలా వృథా అవుతోంది

నెల రోజులుగా తాగునీరు వృథా
బోరు నుంచి లీక్‌ అవుతున్న నీరు,

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): మండలం లోని కత్తేకొట్టాల గ్రామంలో పంచాయతీ బోరు వద్ద లీకేజీ వల్ల నెల రోజులుగా తాగునీరు ఇలా వృథా అవుతోంది. దీనికి ఆ బోరుకు సంబంధించిన స్టార్టర్‌ పెట్టె రోడ్డు పక్కనే.. కిందే అధికారులు ఏర్పాటు చేశారు. ఆ బోరు ఆన చేయడానికి స్టార్టర్‌పెట్టె వద్దకు వెళ్తే షాక్‌ కొడుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. ఆ స్టార్టర్‌పెట్టెకు కనీసం డోర్‌ కూడా లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి లీకేజీని అరికట్టాలని, స్టార్టర్‌ పెట్టెను బాగు చేయాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:20 AM