Share News

సంక్షేమ పాలనకు ఆకర్షితులై టీడీపీలోకి ...

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:08 AM

KNL NEWS

 సంక్షేమ పాలనకు ఆకర్షితులై టీడీపీలోకి ...
టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి

అనుచరులతో వైసీపీ నాయకుడు టీడీపీలో చేరిక

నంద్యాల రూరల్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రజా సంక్షేమ పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకే పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని దేవనగర్‌లో మంత్రి సమక్షంలో దేవనగర్‌కు చెందిన వైసీపీ నాయకుడు దిలీప్‌కుమార్‌ భారీ సంఖ్యలో తన అను చరులతో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కండువా కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికీ పథకాలు అందజేయడంతో పార్టీకి పలువురు ఆకర్శితులు అవుతున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగాన నిలపాలని సీఎం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఆ అబివృద్ధిని చూసి అనేక మంది పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో ఎన్నడూ జరగని అభివృద్ధ్ది కార్యక్రమాలను చూసి టీడీపీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌, టీడీపీ రాష్ట్ర యువనాయకుడు ఎన్‌ఎండీ ఫయాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2026 | 12:09 AM