Share News

ఎన్జీ రంగా వర్సిటీ వీసీగా డాక్టర్‌ పీవీ సత్యనారాయణ

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:48 AM

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వైస్‌ చాన్సలర్‌గా డాక్టర్‌.పి.వి.సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది.

ఎన్జీ రంగా వర్సిటీ వీసీగా డాక్టర్‌ పీవీ సత్యనారాయణ

గుంటూరు సిటీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వైస్‌ చాన్సలర్‌గా డాక్టర్‌.పి.వి.సత్యనారాయణను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌గా పనిచేస్తున్న సత్యనారాయణను ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాల చట్టం 1963లోని సెక్షన్‌ 11 (5) ప్రకారం గవర్నర్‌ ఆదేశాలతో తాత్కాలిక వీసీగా నియమించినట్టు జీవో పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చి, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగనుంది.

Updated Date - Apr 24 , 2026 | 04:48 AM