డాక్టర్ ప్రియాంక కేసు నిందితులు పోలీస్ కస్టడీకి
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:29 AM
డాక్టర్ ప్రియాంక కేసులో నిందితులు దస్యంత్, ఆండ్రూ ఎడ్వర్డ్ జోసెఫ్‌ను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): డాక్టర్ ప్రియాంక కేసులో నిందితులు దస్యంత్, ఆండ్రూ ఎడ్వర్డ్ జోసెఫ్‌ను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే న్యాయస్థానం ఈ నెల 19 మధ్యాహ్నం నుంచి 21 మధ్యాహ్నం వరకు కస్టడీకి అనుమతించింది. బుధవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి నిందితులను కస్టడీకి తీసుకుని ప్రత్యేక వాహనంలో బొమ్మూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ విచారణ అధికారి, అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) పాటిల్ దేవరాజ్ మనీష్ విచారణ చేపట్టారు. నిందితులిద్దరికీ రాత్రికి బొమ్మూరు స్టేషన్‌లోనే బస ఏర్పాటుచేశారు. గురువారం ఉదయం మళ్లీ విచారణ కొనసాగిస్తారు. శుక్రవారం ఉదయం 11గంటల వరకు విచారణ జరుగుతుంది. అనంతరం నిందితులను తిరిగి సెంట్రల్ జైలుకు అప్పగిస్తారు.