Share News

కేజేఎస్ఎస్‌ నూతన భవనానికి రూ కోటి విరాళం

ABN , Publish Date - Feb 02 , 2026 | 05:23 AM

ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో చాలా మంది ప్రవాసాంధ్రులు, ఇతర దాతలు తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి పంచుతున్నారని ప్రవాసాంధ్రుడు..

కేజేఎస్ఎస్‌ నూతన భవనానికి రూ కోటి విరాళం

  • ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదన్న డాక్టర్‌ పిన్నమనేని లెనిన్‌

  • గుడి కంటే బడికే సాయం చేస్తానని వెల్లడి

గుంటూరు(తూర్పు), ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో చాలా మంది ప్రవాసాంధ్రులు, ఇతర దాతలు తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి పంచుతున్నారని ప్రవాసాంధ్రుడు, డాక్టర్‌ పిన్నమనేని లెనిన్‌ అన్నారు. గుంటూరు జేకేసీ రోడ్డులో కమ్మ జన సేవా సమితి నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయాన్ని సమితి సభ్యులతో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా లెనిన్‌ మాట్లాడుతూ నా సంపాదనలో ఎక్కువ శాతం బడికే ఇస్తానని, అంతేగాని దేవాలయాలకు విరాళం ఇవ్వనని స్పష్టం చేశారు. అందుకే గ్రామీణ బాలికల విద్యను ప్రోత్సహిస్తున్న కేజేఎస్ఎస్‌కు రూ.కోటి విరాళాన్ని ఇస్తున్నట్టు చెప్పారు. సమితి సేవలపై తన సహచర మిత్రులతో చర్చించి మరిన్ని విరాళాలను సేకరిస్తానని హామీ ఇచ్చారు. కష్టపడే విధానంపై వారి ప్రతిభ ఆధారపడి ఉందని, ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. సమితి అధ్యక్షుడు మల్లెల హరేంద్రనాథ్‌ చౌదరి మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్‌లో జింఖానా శిశు, మాత కేంద్రం నిర్మాణంలో డాక్టర్‌ లెనిన్‌ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. కేజేఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో 2 వేల మంది బాలికలను వసతి కల్పించేందుకు రూ.50 కోట్లతో నిర్మిస్తున్న భవనానికి రూ. కోటి విరాళాన్ని ఇవ్వడం ఆయన దాతృత్వానికి నిదర్శమని చెప్పారు. అనంతరం డాక్టర్‌ లెనిన్‌ను సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు.

Updated Date - Feb 02 , 2026 | 05:27 AM