డాక్టర్ నరేష్ బాబుకు రెండు జాతీయ అవార్డులు
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:22 AM
ఇటీవల పుణేలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఎస్ఐ) జాతీయ సదస్సులో...
ఏఎస్ఎస్ఐ రిసెర్చ్, క్లినికల్ అవార్డులు కైవసం
గుంటూరు మెడికల్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పుణేలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఎస్ఐ) జాతీయ సదస్సులో గుంటూరుకు చెందిన మల్లిక స్పైన్ సెంటర్ అధినేత డాక్టర్ జె.నరేష్ బాబు అరుదైన ఘనత సాధించారు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో గుర్తించలేని నడుము డిస్క్‌ల అరుగుదలను రేడియోమిక్స్ అనే ఏఐ ద్వారా ముందుగానే గుర్తించే వైద్య పరిశోధన చేసినందుకు ప్రతిష్టాత్మకమైన ఏఎస్ఎస్ఐ బేసిక్ రీసెర్చ్ అవార్డ్ 2026ను ఆయన అందుకున్నారు. బేసిక్ స్పైన్ రీసెర్చ్ అవార్డుతో పాటు ఏఎ్‌సఎ్‌సఐ క్లినికల్ రీసెర్చ్ అవార్డునూ డాక్టర్ నరేష్ బాబు సాధించారు.