ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌గా నందకిశోర్
ABN , Publish Date - Jun 04 , 2026 | 04:29 AM
ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌గా గార్లపా టి నందకిశోర్ ఎన్నికయ్యారు. విజయవాడలోని మెడికల్ కౌన్సిల్ కార్యాలయం లో బుధవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది..
అమరావతి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌గా గార్లపా టి నందకిశోర్ ఎన్నికయ్యారు. విజయవాడలోని మెడికల్ కౌన్సిల్ కార్యాలయం లో బుధవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. మెడికల్ కౌన్సిల్‌లో సభ్య త్వం కలిగిన వైద్యులు ఎనుకున్న 13 మంది, అంతకుముందు ప్రభుత్వం నామినేట్ చేసిన 8 మంది, ఎక్స్‌అఫిషియో సభ్యులు నలుగురు ఓటింగ్‌లో పాల్గొన్నా రు. చైర్మన్‌గా నందకిశోర్, వైస్ చైర్మన్‌గా సుబ్బానాయుడు ఎన్నికయినట్లు రిటర్నింగ్ అధికారి చక్రధర్‌బాబు వెల్లడించారు. వీరితోపాటు కొత్త చైర్మన్ నేతృత్వంలోని ముగ్గురు కార్యనిర్వాహక సభ్యుల ఎన్నిక జరిగింది. కౌన్సిల్ మాజీ చైర్మన్ శ్రీహరిరావు, సుబ్బారెడ్డి, స్వర్ణగీత కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నికయ్యారు.