డా.కె.కె.ఆర్ గౌతమ్ విద్యార్థుల హవా
ABN , Publish Date - May 01 , 2026 | 04:50 AM
పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో డా.కె.కె.ఆర్ గౌతమ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది.
గుడివాడ, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో డా.కె.కె.ఆర్ గౌతమ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. తమ విద్యార్థి ఆర్.హేమశ్రీరెడ్డి 600 మార్కులకు 598 మార్కులు సాధించినట్ట్టు వెల్లడించింది. అదే విధంగా డి.మదీహ 596, బి.నిహారిక 595, పి.ఆశ్రిత్ 595 మార్కులతో డా.కె.కె.ఆర్ గౌతమ్ స్కూల్స్ విజయ పతాకాన్ని ఎగురవేశారని పేర్కొంది. అంతేకాకుండా వివిధ బ్రాంచీల్లో 590 మార్కులు పైన సాధించిన వారు 61 మంది కాగా, 580 మార్కులు పైన సాధించిన వారు 303 మంది, 505 మార్కుల పైన సాధించినవారు 1575 మంది ఉన్నారని చెప్పింది. స్కూల్స్ సగటు మార్కుల శాతం 87.01గా నమోదైనట్టు వివరించింది. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి స్కూల్స్ యాజమాన్యం అభినందనలు తెలిపింది.