Share News

గైనకాలజిస్ట్‌ల సంఘ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:45 AM

ఆంధ్రప్రదేశ్‌ గైనకాలజిస్ట్‌ల సంఘ రాష్ట్ర కమిటీ ఆదివారం ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఒంగోలుకు చెందిన డాక్టర్‌ హరిరోహిణీ కుమారి.

గైనకాలజిస్ట్‌ల సంఘ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

  • అధ్యక్షురాలిగా డాక్టర్‌ హరిరోహిణీ కుమారి

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌ గైనకాలజిస్ట్‌ల సంఘ రాష్ట్ర కమిటీ ఆదివారం ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఒంగోలుకు చెందిన డాక్టర్‌ హరిరోహిణీ కుమారి, కార్యనిర్వాహక కార్యదర్శిగా డాక్టర్‌ మండువ కమలాసుభాష్‌, కోశాధికారిగా డాక్టర్‌ గింజుపల్లి కల్పనాకుమారితోపాటు మరో 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి ఒంగోలులో మూడు రోజులపాటు జరిగిన గైనకాలజిస్టుల రాష్ట్ర సదస్సు ఆదివారం ఘనంగా ముగిసింది. సుమారు 2,500 మంది వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 03:45 AM