ఎస్‌టీ అండ్ ఐ సెక్రటరీగా హనుమంతు పురుషోత్తం
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:53 AM
రాష్ట్రంలో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి సెక్రటరీగా డాక్టర్ హనుమంతు పురుషోత్తంను ప్రభుత్వం నియమించింది.
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి సెక్రటరీగా డాక్టర్ హనుమంతు పురుషోత్తంను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి సెక్రటరీ పోస్టు భర్తీకి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ మార్గాల్లో దరఖాస్తులను ఆహ్వానించింది. వచ్చిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డాక్టర్ హనుమంతు పురుషోత్తంను ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రభుత్వమూ ఆమేరకు ఆమోదం తెలిపింది. ఈ పదవిలో డాక్టర్ హనుమంతు మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఆయన నియామకానికి సంబంధించిన నిబంధనలను ప్రత్యేకంగా ఇవ్వనున్నారు.