Share News

పెన్షనర్ల సమస్యలను పట్టించుకోరా?

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:42 PM

ఏళ్ల తరబడి పరిష్కారం కాని బీఎనఎనఎల్‌ పెన్షనర్ల సమస్యలను పట్టించుకోరా? అని ఆల్‌ ఇండియా బీఎ్‌సఎనఎల్‌ డీఓటి పెన్షనర్స్‌ అసోసియేషన(ఏఐబీడీపీఏ) జిల్లా కార్యదర్శి జె.వెంకటరమణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పెన్షనర్ల సమస్యలను పట్టించుకోరా?
కలెక్టరేట్‌ ఎదుట ఽనిరసనలో మాట్లాడుతున్న అసోసియేషన నాయకులు

ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాలు ఉధృతం

ఏఐబీడీపీఏ కార్యదర్శి జె.వెంకటరమణ

కర్నూలు న్యూసిటీ, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి పరిష్కారం కాని బీఎనఎనఎల్‌ పెన్షనర్ల సమస్యలను పట్టించుకోరా? అని ఆల్‌ ఇండియా బీఎ్‌సఎనఎల్‌ డీఓటి పెన్షనర్స్‌ అసోసియేషన(ఏఐబీడీపీఏ) జిల్లా కార్యదర్శి జె.వెంకటరమణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే దేశస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఫోరమ్‌ ఆఫ్‌ సివిల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన పిలుపు మేరకు శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జె.వెంకటరమణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెన్షనర్స్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. పెన్షనర్స్‌ వ్యాలీపేషన క్లాజును పర్మినెంట్‌గా ఆర్థిక బిల్లులో ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెన్షనర్స్‌ సంఘాలన్నీ ఈ క్లాజ్‌ను పర్మినెంటుగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వంలో తాము ఉద్యోగులుగానే చేరామని, కానీ పెన్షన్లలో మాత్రం తమకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. అందరు ఉద్యోగులకు పెన్షన్లు పెరుగుతూ ఉంటే తాము మాత్రం పదేళ్ల క్రితం నాటి పెన్షనతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందన్నారు. కేంద్రం దిగిరాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, ఆల్‌ ఇండియా బీఎ్‌సఎనఎల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన అధ్యక్షుడు కె.ప్రభాకర్‌, బి.భాస్కర్‌రావు, పోస్టల్‌ అండ్‌ ఆర్‌ఎంఎస్‌ పెన్షనర్స్‌ నాయకులు పద్మనాభ శాసి్త్ర, తదతరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 11:42 PM