ఇతర నియోజకవర్గ నాయకుల జోక్యం చేసుకోవద్దు
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:03 PM
దేవనకొండ మండలంలో ఇతర నియోజకవర్గ అధికార పార్టీ నాయకులు జ్యోకం చేసుకోవద్దని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ అన్నారు.
టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్
దేవనకొండ, జనవరి 22(ఆంధ్రజ్యోతి): దేవనకొండ మండలంలో ఇతర నియోజకవర్గ అధికార పార్టీ నాయకులు జ్యోకం చేసుకోవద్దని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ అన్నారు. దేవనకొండ సహకార సంఘం సింగిల్ విండో అధ్యక్షుడిగా రాజశేఖర్ గౌడ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్యాక్స్ పంక్షనహల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి వైకుంఠం జ్యోతి, వాల్మీకి కార్పొరేషన చైర్‌పర్సన కప్పట్రాళ్ల బొజ్జమ్మ మాట్లాడారు. మండలంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్దే ధ్యేయమని, పెత్తందార్లకు కాదని అన్నారు. గతంలో మాదిరిగా మండలంలో ప్రతి ఒక్కరూ మాట్లాడితే సహించేది లేదని, మీరు డబ్బుతో రాజకీయం చేస్తే మేము ప్రజా బలంతో రాజకీయం చేస్తామని అన్నారు. పార్టీలో కష్టపడేవారికే పదవులు వస్తాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్‌గౌడ్, జనసేన ఇనచార్జి వెంకప్ప, మార్కెట్‌యార్డు చైర్మన వెంకటేశ, మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు, మార్కెట్‌యార్డు వైస్ చైర్మన రంగడు, తదితరులు పాల్గొన్నారు.