Share News

ఫ్యాక్షన జోలికి వెళ్లొద్దు

ABN , Publish Date - May 29 , 2026 | 11:40 PM

ఫ్యాక్షన రక్కసి జోలికి వెళ్లొద్దని, హలం పట్టి పొలంలో బంగారు పండించాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సూచించారు.

 ఫ్యాక్షన జోలికి వెళ్లొద్దు
వెల్దుర్తిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

- హలం పట్టి బంగారు పండించండి

- ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

- తూము నిర్మాణానికి భూమి పూజ

వెల్దుర్తి, మే 29(ఆంధ్రజ్యోతి): ఫ్యాక్షన రక్కసి జోలికి వెళ్లొద్దని, హలం పట్టి పొలంలో బంగారు పండించాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సూచించారు. శుక్రవారం హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ఎడమవైపు 57 నెంబరు వద్ద తూము(స్లూయిస్‌) నిర్మా ణా నికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబు మాట్లాడుతూ మాజీ డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి హయాంలో తూము ఏర్పాటుకు ప్రతిపాదన జరిగిందన్నారు. గత ప్ర భుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తూము నిర్మాణానికి చర్యలు చేపట్టిందన్నారు. నార్లాపురం, అల్లు గుం డు, బొమ్మిరెడ్డిపల్లి, మల్లెపల్లి, వెంకటాపురం గ్రామాల్లో తాగునీటితో పాటు సుమారు 1000 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నా రు. టీడీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, వ్యవసాయం చేసుకొని ప్రశాంత జీవనం గడపాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకుడు సుబ్బారాయుడు, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌గౌడు, సింగిల్‌ విండో చైర్మన రమాకాంతరెడ్డి, హెచఎనఎస్‌ఎస్‌ అధికారులు ఎస్‌ఈ రాజన్నబాబు, ఈఈ ప్రసాద్‌రావు, డీఈఈ హరిప్రసాదు, ఏఈ వేంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.

మూడు వేల ఎకరాలకు సాగునీరు

క్రిష్ణగిరి: హంద్రీ నీవా కాల్వకు స్లూయిజ్‌ కాల్వ ఏర్పాటుతో మూడు వేల ఎకరాలు సస్యశామలం కానున్నాయని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. శుక్రవారం హంద్రీ నీవా ప్రధాన కాల్వ 71వ కిలోమీటర్‌ దగ్గర స్లూయిజ్‌ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం పరిధిలో హంద్రీ నీవా కాల్వకు 8 స్లూయిజ్‌ గేట్లను ఏర్పాటు చేసి రైతులకు సాగు నీరందిస్తామని అన్నారు. దీంతో రైతులు బంగారు పంటలు పండించుకోవచ్చని, ఎవరు వలస వెళ్లే పరిస్థితి రాదని అ న్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు కమిటీ చైర్మన నబి సా హెబ్‌, మర్రి శ్రీరాములు, ఎల్వీ ప్రసాద్‌, దామోదర్‌ నాయుడు, మ హ్మద్‌ రఫీ, రాంబాబు రెడ్డి, జ్యోతి గౌడ్‌, చంద్ర, శివరాముడు, రామాంజనేయులు, లతీఫ్‌, సజ్జద్‌ అహ్మద్‌ తదితరులున్నారు.

నేడు ఎమ్మెల్యే కేఈ రాక

మద్దికెర: మండల పరిధిలోని బొమ్మనపల్లి, హంపా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు రానున్నారని మాజీ సర్పంచ బొమ్మనపల్లి ఆంజనేయ, పత్తికొండ మార్కెట్‌ యార్డు మాజీ వైస్‌ చైర్మన అశోక్‌ కుమార్‌, కార్యదర్శి పరమేశ్వరప్ప తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో రూ.32 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, హంపా గ్రామంలో రూ.22లక్షలతో నిర్మించిన హెల్త్‌ క్లీనిక్‌ ప్రారంభోత్సవానికి వస్తున్నారని, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

తుగ్గలి: పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు జొన్నగిరికి వస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు తిరుపాల్‌నాయుడు, వెంకట్రా ముడు చౌదరి, మాజీ అధ్యక్షులు శివరామ్‌ చౌదరి తెలిపారు. శుక్రవా రం వారు విలేకరులతో మాట్లాడుతూ జొన్నగిరిలో రూ.40 లక్షలతో జొన్నగిరి-మద్దికెర ప్రధాన రహదారిలో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కేఈ వస్తున్నారన్నారు. పార్టీ నాయకు లు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

Updated Date - May 29 , 2026 | 11:40 PM