Share News

దొనకొండ విమానాశ్రయం పరిశీలన

ABN , Publish Date - Apr 12 , 2026 | 05:11 AM

ప్రకాశం జిల్లా దొనకొండలోని బ్రిటిష్‌ కాలంనాటి విమానాశ్రయాన్ని గన్నవరం ఎయిర్‌పోర్టు అధికారుల బృందం సందర్శించింది.

దొనకొండ విమానాశ్రయం పరిశీలన

  • గన్నవరం నుంచి వచ్చిన అధికారుల బృందం

దొనకొండ, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా దొనకొండలోని బ్రిటిష్‌ కాలంనాటి విమానాశ్రయాన్ని గన్నవరం ఎయిర్‌పోర్టు అధికారుల బృందం సందర్శించింది. విమానాశ్రయం ప్రస్తుత పరిస్థితిని పరిశీలించింది. గన్నవరం విమానాశ్రయ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి సునీత, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ వంశీ, టెర్మినల్‌ మేనేజర్‌ అంకిత్‌ బృందం శనివారం ప్రత్యేక వాహనంలో దొనకొండకు చేరుకుంది. విమానాశ్రయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ బృందం వచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 12 , 2026 | 05:12 AM