రాష్ట్ర పండుగగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:11 AM
ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 23వ తేదీన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా జిల్లాల్లో, హెచ్‌వోడీలు, ఇతర శాఖల్లో జయంతి వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. తాము అధికారంలోకి వస్తే దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.