Share News

దేశీయ పర్యాటకానికే జై!

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:14 AM

వేసవి నేపథ్యంలో విహార యాత్రల సీజన్‌ ప్రారంభమైపోయింది. ఈసారి విదేశీ పర్యటనలపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం బాగా కనిపిస్తోంది. ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వారు గతంలో...

దేశీయ పర్యాటకానికే జై!

  • విదేశీ యాత్రలపై యుద్ధం ఎఫెక్ట్‌

  • విమాన చార్జీల పెరుగుదల మరో కారణం

  • ‘పహల్గామ్‌’ ప్రభావంతో కశ్మీర్‌కు తగ్గిన ట్రిప్స్‌

  • ప్రత్యామ్నాయంగా హిమాచల్‌ వైపు చూపు

  • కేరళ, తమిళనాడు వైపు పర్యాటకుల మొగ్గు

‘‘పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చేశారు! ఈసారి ఎక్కడికి వెళదాం!’’ దాదాపు ప్రతి ఇంట్లో ఇదే చర్చ! కానీ... ఇప్పుడు అత్యధికులు దేశీయ పర్యాటకానికే జై కొడుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో విదేశీ పర్యటనలంటే వెనకడుగు వేస్తున్నారు.

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

వేసవి నేపథ్యంలో విహార యాత్రల సీజన్‌ ప్రారంభమైపోయింది. ఈసారి విదేశీ పర్యటనలపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం బాగా కనిపిస్తోంది. ఆర్థికంగా వెసులుబాటు ఉన్న వారు గతంలో పర్యాటక స్వర్గధామాలైన యూఏఈలోని దుబాయ్‌, ఇతర గల్ఫ్‌ దేశాలతో పాటు అమెరికా, యూరప్‌ ట్రిప్‌లకు క్యూ కట్టేవారు. అయితే, ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విదేశీ యాత్రలకు మొగ్గు చూపడంలేదు. ఉద్రిక్తతలు గల్ఫ్‌ దేశాలకే పరిమితమైనప్పటికీ... యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరిగి, విమానయాన ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. డై నమిక్‌ ఫేర్‌ కారణంగా టికెట్ల ధరలు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. దీంతో ‘ఫారిన్‌ టూర్‌ ఇప్పుడొద్దు... తర్వాత చూద్దాం’ అనుకుంటున్నారు. ‘ఏదిఏమైనా సరే విదేశీ విహా రం చేయాల్సిందే! బడ్జెట్‌ ఎంతైనా తగ్గేదే లే దు’ అనుకునే వారు నేపాల్‌, భూటాన్‌, శ్రీలం క వంటి దగ్గరి దేశాలను ఎంచుకుంటున్నారు.


కశ్మీర్‌పై పహల్గామ్‌ ఎఫెక్ట్‌...

మన దేశంలో వేసవిలో విహారం అనగానే గుర్తుకొచ్చేది కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌! గత ఏడాది ఇదే సమయంలో జరిగిన పహల్గామ్‌ ఘటనతో కశ్మీర్‌కు పర్యాటకుల సంఖ్య తగ్గిందని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. ఆ మేరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలీకి డిమాండ్‌ మరింత పెరిగిందని పేర్కొంటున్నారు. ఇక... దక్షిణాదిలో మున్నార్‌, ఊటీ, కూర్గ్‌, కొడైౖకెనాల్‌, యార్కాడ్‌, యాలగిరి, అరకు తదితర ప్రాంతాలకు పర్యాటకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. తూర్పు కనుమల్లో చల్లటి వాతావరణంతో ఆహ్లాదంగా ఉండే వయనాడ్‌, తేక్కడి, మడికేరి, విరాజ్‌పేట వంటి అటవీ ప్రాంతాలకూ బుకింగ్స్‌ పెరిగాయని టూర్‌ ఆపరేటర్లు పేర్కొంటున్నారు.

ప్లాన్‌ చేసుకొని వెళ్తే బెటర్‌!

ఇంతకు ముందు 40 శాతం మంది ఎలాంటి ప్రణాళికా లేకుండా, ఒక డెస్టినేషన్‌ అనుకోవటం తమ సొంత కార్లపై అక్కడికి వెళ్లాక హోటల్స్‌ బుక్‌ చేసుకుని, తిరగాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసుకునేవారు. మిగిలిన 60 శాతం మంది మాత్రమే సరైన ప్లానింగ్‌తో ట్రిప్పులు పెట్టుకునేవారు. ఈ వేసవిలో పర్యాటక ప్రాంతాలన్నీ ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కొన్ని పర్యాటక ప్రాం తాల్లో మితిమీరిన పర్యాటకుల రద్దీని నివారించేందుకు స్థానిక అధికారులు ప్రత్యేక ఆం క్షలు విధిస్తున్నారు. ఈ-పర్మిషన్‌ తీసుకున్న వారినే అనుమతించడం, హోటల్‌ బుకింగ్స్‌ లేకుంటే వెనక్కి పంపించడంలాంటి చర్యలూ తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం, ఎలాంటి అనుమతులు అవసరం వంటివన్నీ ము ందే తెలుసుకుని బ్యాగులు సర్దుకుంటే బెటర్‌!


అసాధారణ బుకింగ్‌లు

ఈ వేసవిలో దేశీయ పర్యాటక బుకింగ్‌లు అసాధారణ స్థాయిలో జరుగుతున్నా యి. ఏప్రిల్‌లో జరిగిన బుకింగ్స్‌ చూసి ఆశ్చర్యపోతున్నాం. ఇక మే నెలలో ఎలా ఉం టుందో ఊహించుకోవచ్చు! ఎల్పీజీ కొరత నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని... ప్యాకేజ్‌లో ‘ఫండ్‌ ఇన్‌క్లూడెడ్‌’ ట్రిప్పులకే ప్రాధాన్యం ఇస్తున్నాం.

- సుధా చంద్రమౌళి, ది రాయల్‌ టూరిజం డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌)

దేశంలోని పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చేందుకు ఆసక్తి చూపుతుండడంతో.. కొద్ది రోజులుగా భారీ స్థాయిలో విహార యాత్రల బుకింగ్‌లు నమోదవుతున్నాయి. ఏప్రిల్‌ నెలలో ప్రధాన పర్యాటక కేంద్రాల్లోని హోటళ్లు 95 శాతం వరకు బుక్‌ అయ్యాయి. అటు యుద్ధ ప్రభావం, ఇటు పర్యాటకుల డిమాండ్‌తో విమానయాన చార్జీలూ పెరిగిపోయాయి.

Untitled-2 copy.jpg

Updated Date - Apr 26 , 2026 | 04:16 AM