డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:53 PM
గృహ అవసరాల కోసం కేటాయించిన (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వాడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో మంగళవారం పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో రెవెన్యూ , పౌర సరఫ రాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
ఆదోని, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): గృహ అవసరాల కోసం కేటాయించిన (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వాడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో మంగళవారం పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో రెవెన్యూ , పౌర సరఫ రాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్‌వో రాజా రఘువీర్ నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టణ వ్యాప్తంగా 88 హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో సోదాలు ని ర్వహిం చాయి. 107 గృహ అవసరాల సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ద్వారా హోటళ్లకు సిలిండర్లు విక్రయిస్తున్నట్లు తమదృష్టికి వచ్చిందని, అక్రమాలకు పాల్పడితే సదరు గ్యాస్ ఏ జెన్సీ లైసెన్సులను రద్దు చేస్తామని డీఎస్‌వో రాజారఘువీర్ హెచ్చరించారు. దాడుల్లో సీఎస్ డీటీ లు రుద్రగౌడ్, నవీన్, శివరాం, ఏఎస్‌ఓ వెంకటరాజు, ఎఫ్‌ఐలు వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌రెడ్డి, 20 మంది వీఆర్వోలు పాల్గొన్నారు.