సర్కారు బడిలో డాక్టర్, టీచర్ల పిల్లలు
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:46 AM
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బోర్డు ఆదర్శ పాఠశాలలో విద్యావంతులైన పలువురు తమ పిల్లలను చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు.
నరసన్నపేట, జూన్ 18(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బోర్డు ఆదర్శ పాఠశాలలో విద్యావంతులైన పలువురు తమ పిల్లలను చేర్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఏడాది ఈ పాఠశాలలో 40 మంది దాకా చేరారు. వీరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలు జి.పూజ భరద్వాజ్ తన కుమార్తెను, దంత వైద్యుడు సాగర్ తన కుమారుడిని, ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా చేస్తున్న వంశీకృష్ణ తన కుమార్తెను ఒకటో తరగతిలో చేర్పించారు. ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు యాళ్ల అప్పలనాయుడు తన కుమార్తెను ప్రైవేటు పాఠశాలల నుంచి తీసుకొచ్చి మూడోతరగతిలో చేర్పించారు.