Share News

నాణ్యత లోపించిన కూరగాయలు విక్రయించొద్దు

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:04 AM

రైతుబజా ర్లలో పారిశుధ్యం లోపిస్తే చర్యలు తీసుకుంటామని ఐఎస్వో రాష్ట్ర ఆడిటర్‌ అలపాటి శివయ్య తెలిపారు. నాణ్యత లోపించిన కూరగా యలను వినియోగ దారులకు వి క్రయించినా, వినియో గదారులకు తాగునీటి సదుపాయం కల్పించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నాణ్యత లోపించిన కూరగాయలు విక్రయించొద్దు
రైతుబజారును పరిశీలిస్తున్న శివయ్య:

విజయనగరం టౌన్‌, జూలై2 (ఆంధ్ర జ్యోతి): రైతుబజా ర్లలో పారిశుధ్యం లోపిస్తే చర్యలు తీసుకుంటామని ఐఎస్వో రాష్ట్ర ఆడిటర్‌ అలపాటి శివయ్య తెలిపారు. నాణ్యత లోపించిన కూరగా యలను వినియోగ దారులకు వి క్రయించినా, వినియో గదారులకు తాగునీటి సదుపాయం కల్పించకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం విజయనగరంలోని ఆర్‌అండ్‌బీ రైతుబజారులో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. వినియోగదారులకు తూచే కాటాలను సీళ్లు ఉండాలని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగితే వినియోగదా రులు, రైతులను అప్రమత్తం చేయడానికి అలారం ఏర్పాటుచేయాలని సూచించారు. ఆయనతో పాటు ఎస్టేట్‌ అధికారులు లీలారాణి, సతీష్‌, ఆచారి ఉన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:04 AM