Share News

NTR Health University: డీఎన్‌బీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jan 18 , 2026 | 03:45 AM

ఇన్‌ సర్వీస్‌ కోటా అభ్యర్థులకు సంబంధించి డీఎన్‌బీ(డిప్లొమేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌) సీట్ల భర్తీకి ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

NTR Health University: డీఎన్‌బీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

  • 22 వరకూ దరఖాస్తులకు అవకాశం

అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఇన్‌ సర్వీస్‌ కోటా అభ్యర్థులకు సంబంధించి డీఎన్‌బీ(డిప్లొమేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌) సీట్ల భర్తీకి ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ వి.రాధికా రెడ్డి శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 2025-26 అడ్మిషన్లకు సంబంధించి డీఎన్‌బీ పోస్ట్‌ ఎంబీబీఎస్‌ కోర్సులు, పోస్ట్‌ ఎంబీబీఎస్‌ డిప్లొమా కోర్సుల్లో సీట్లు భర్తీ చేయనుంది. ఇన్‌ సర్వీస్‌ కోటా అభ్యర్థులు 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 4 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ ఏడాది జరిగిన పీజీ నీట్‌లో అర్హత సాధించి ఉండాలి. గత ఏడాది జూలై 31న నాటికి ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి. నీట్‌ నోటిఫికేషన్‌ సమయానికి 50 ఏళ్ల వయసు దాటి ఉండకూడదన్న నిబంధనలను అనుసరించాలి. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

Updated Date - Jan 18 , 2026 | 03:45 AM