Share News

దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:52 AM

బిగ్‌బాస్‌ షో పోటీదారు తనూజ పుట్టినరోజు సందర్భంగా దివ్వెల మాధురి నిబంధనలు అతిక్రమించి తిరుమలలో కేకు కట్‌ చేయించడాన్ని...

దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు ఫిర్యాదు

తిరుమల, మార్చి 6(ఆంధ్రజ్యోతి): బిగ్‌బాస్‌ షో పోటీదారు తనూజ పుట్టినరోజు సందర్భంగా దివ్వెల మాధురి నిబంధనలు అతిక్రమించి తిరుమలలో కేకు కట్‌ చేయించడాన్ని టీటీడీ సీరియ్‌సగా పరిగణించింది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధమని, ఆమె ఆ వీడియో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టడం సరికాదని పేర్కొంది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది.

Updated Date - Mar 07 , 2026 | 04:54 AM