దివ్య ఔషధం సబ్జా
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:15 PM
వేసవి వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతుంటారు. వేసవి తాపంలో సబ్జా నీరు దివ్య ఔషధంగా పనిచేసి ఉపశమనం ఇస్తోంది.
శరీరంలో వేడిని తగ్గించే సహజ సిద్ధమైన గింజలు
నీటిలో కలిపి తాగితే రోగాలు దరిచేరవు
శరీర బరువు తగ్గించేందుకు దోహదం
ఆత్మకూరు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): వేసవి వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతుంటారు. వేసవి తాపంలో సబ్జా నీరు దివ్య ఔషధంగా పనిచేసి ఉపశమనం ఇస్తోంది. సబ్జా కలిపిన నీటిని తాగితే రోగాలు దరిచేరవు. మధుమేహాన్ని అదుపులో ఉంచుతోంది. ఈ నీరు దాహార్తిని తీర్చడంతో పాటు శరీర డీహైడ్రేషన్ రాకుండా చూస్తోంది. శరీర బరువు తగ్గించడానికి దోహదపడుతోంది. అద్భుత గుణా లు కలిగిన ఔషధకారిణిగా సబ్జాగింజలు ఉపయోగపడుతాయి. పాతకాలం రోజుల్లో వేసవి ఉపశమనానికి అప్పటి ప్రజలు సబ్జాను అధికంగా వినియోగించేవారు. కాలానుగుణంగా సబ్జా గింజల ద్రవాన్ని తాగేవారు తగ్గిపోయినప్పటికీ ప్రస్తుతం మళ్లీ సబ్జా గింజలతో కలిగే ప్రయోజనాలను తెలుసుకొని వీటిని నీటిలో కలిపి తాగుతున్నారు.
ఔషధ గుణాలు ఎన్నో..
ఫ సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తోంది. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతోంది. మాంసాహారం తిన్నవారికి శరీర తా పం అధికంగా వుంటుంది. అలాంటప్పుడే సబ్జాగింజలు నీళ్లలోగాని, కొబ్బరినీళ్లలో గాని 15-30 నిమిషాలు నానబెట్టి సేవిస్తే సత్వర ఉపశమనం ఉంటుంది.
ఫ అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనం ఉంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జాగింజల గుజ్జు వేసి రోజుకు మూడు నాలుగు సార్లు సేవిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. వీటి గుజ్జును పైనాపిల్, ఆపిల్, ద్రాక్షా రసాల్లో కలిపి పిల్లలకు తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ధనియాల రసంతో ఇస్తే జ్వరం తగ్గుతోంది.
ఫ మనిషి శరీర బరువును కూడా సబ్జాగింజలు తగ్గిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సబ్జాగింజలతో నానబెట్టిన నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలు ఇస్తాయి.
ఫ శరీరంలో బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తోంది. ఈనీటిని రాత్రిపూట తాగడంతో మరుసటి రోజుకు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
ఫ సబ్జాగింజలు నీటిలో వేసిన తర్వాత ఉబ్బి జెల్స్‌గా తయారయ్యే వరకు నానబెట్టాలి. ఈనీటిని తాగడంతో శరీర జీవక్రియ మెరుగపడటమే కాకుండా శరీర పనితీరుకు ఉపకరించే ప్యాటీఆమ్లాలతో పాటు అధికంగా పీచుని సబ్జాగింజలు కలిగి వుంటాయి.
ఫ మహిళలకు అవసరమైన ఫోలెట్, ఇయాసిన్, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్-ఈ లభించడంతో పాటు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాల్ని తొలగిస్తాయి.
ఫ గోరు వెచ్చటి నీళ్లలో సబ్జాగింజలను నానబెట్టి అందులో అల్లంరసం, తేనె కలిపి తాగితే శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
ఫ సబ్జా గింజలను నానబెట్టకుండా నేరుగా తినకూడదు. ఎందుకంటే అవి గొంతులో చిక్కుకుని ఇబ్బందులకు గురిచేస్తాయి. రోజుకు 1-2 టీస్పూన్లు తీసుకోవడం మంచిది. అతిగా తీసుకుంటే జీర్ణ సమస్యలు ఉత్పన్నయ్యే ప్రమాదం ఉంది.
రు.