Public Supply Corporation: రేషన్ షాపుల్లో గోధుమపిండి పంపిణీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:41 AM
రేషన్ షాపుల్లో గోధుమపిండి పంపిణీ ప్రారంభమైంది. పౌరసరఫరాల సంస్థ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.డిల్లీరావు గురువారం విజయవాడలో ఈ...
విజయవాడలో ప్రారంభించిన పౌరసరఫరాల సంస్థ ఎండీ
అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): రేషన్ షాపుల్లో గోధుమపిండి పంపిణీ ప్రారంభమైంది. పౌరసరఫరాల సంస్థ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.డిల్లీరావు గురువారం విజయవాడలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు కొన్ని ముఖ్యపట్టణాలు, నగరాల్లో ప్రయోగాత్మకంగా గోధుమపిండి పంపిణీ చేపట్టారు. ఇది విజయవంతమైతే తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని డిల్లీరావు తెలిపారు. ‘కేంద్రప్రభుత్వం ప్రతినెలా 1800 టన్నుల గోధుమలను రాష్ట్రానికి కేటాయిస్తోంది. కానీ, ఇప్పటివరకు వాటిని రాష్ట్రం తీసుకోలేదు. గోధుమల్లో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల కేంద్రం నుంచి గోధుమలను తీసుకున్నాం. వాటిని పిండిగా మార్చి కార్డుదారులకు కిలో ప్యాకెట్ల రూపంలో కేజీ రూ.20కు అందిస్తున్నాం’ అని చెప్పారు.