డిసిప్లినరీ కేసులు దీర్ఘకాలం పెండింగ్‌లో ఉండవు
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:00 AM
ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యల కేసులను ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచబోమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు చెప్పారు.
ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యల కేసులను ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచబోమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు చెప్పారు. కేసులపై డీఈవోలు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో సబ్జెక్టు వారీగా పది మంది టీచర్లకు స్టడీ లీవు అనుమతిపై చర్చించారు. మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంగా పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు వారి సబ్జెక్టు సీనియారిటీనే కొనసాగిస్తారని అధికారులు తెలిపారు. మున్సిపల్ టీచర్ల పీఎఫ్ నిర్వహణపై త్వర లోనే విధివిధానాలు ప్రకటిస్తామన్నారు.