దిబ్బపాలెంపై పోలీసుల నిఘా
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:45 AM
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సెజ్ పునరావాస కాలనీ (దిబ్బపాలెం)లో శనివారం పోలీసులు కార్బన్ సెర్చ్ నిర్వహించారు. దిబ్బపాలెం పంచాయతీ పరిధిలో అచ్యుతాపురం...
‘అక్షరమే అండగా’ కార్యక్రమానికి స్పందన
అచ్యుతాపురం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సెజ్ పునరావాస కాలనీ (దిబ్బపాలెం)లో శనివారం పోలీసులు కార్బన్ సెర్చ్ నిర్వహించారు. దిబ్బపాలెం పంచాయతీ పరిధిలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలకు చెందిన 24 గ్రామాలకు చెందిన ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ఈ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. గంజాయి బ్యాచ్‌లు విచ్చలవిడిగా తిరుగుతూ కాలనీ వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని గురజాపాలేనికి చెందిన లాలం రామజగదీశ్ గత నెల 12న దిబ్బపాలెంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్న సీఐ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఈ నెల 2 నుంచి డ్రోన్ సహాయంతో దిబ్బపాలెం కాలనీలో జల్లెడ పడుతున్నారు. శనివారం సుమారు 60 మంది పోలీసులతో సోదాలు నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటినీ తనిఖీ చేసి బ్యాగులను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేని 17 వాహనాలను సీజ్ చేశారు. ఇందులో ఒక అటో కూడా ఉంది.