Share News

హోరాహోరీగా ధ్యాన చంద్‌ క్రీడా పోటీలు

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:58 PM

పట్టణంలోని మునిసిపల్‌ క్రీడా మైదానంలో ఏపీ పీఈటీఎస్‌ అండ్‌ ఎస్‌ఎస్‌పీఈ అసోసియేషన ఆధ్వర్యంలో జరుగుతున్న ధ్యాన చంద్‌ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి.

హోరాహోరీగా ధ్యాన చంద్‌ క్రీడా పోటీలు
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎంఈవో రంగన్న

ఆదోని అగ్రికల్చర్‌, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని మునిసిపల్‌ క్రీడా మైదానంలో ఏపీ పీఈటీఎస్‌ అండ్‌ ఎస్‌ఎస్‌పీఈ అసోసియేషన ఆధ్వర్యంలో జరుగుతున్న ధ్యాన చంద్‌ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. శనివారం రెండవ రోజు ఖోఖో పోటీలను మండల విద్యాశాఖ అధికారి-2 రంగన్న ప్రారంభిస్తూ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సూచిం చారు. 26 బాలుర, 24 బాలికల జట్లు పాల్గొన్నట్లు నిర్వాహకులు నరసింహులు, నరసింహరాజు తెలిపారు. బాలుర విభాగంలో కోసిగి జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, జడ్పీ హెచఎస్‌ దొడ్డనగేరి పాఠశాలలో ఫైనల్‌కు చేరుకున్నాయి. బాలికల విభాగంలో పెద్ద తుంబలం జడ్పీ హెచఎస్‌ పాఠశాల, జంపాపురం జడ్పీ పాఠశాల సెమీఫైనల్‌కి చేరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు ఖలీల్‌ అహ్మద్‌, కళ్యాణ్‌ రావ,ు రామన్న, ఓబన్న, రమేష్‌ చెన్న బసప్ప, జగన్నాథ్‌, శ్రీరామ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:58 PM