చైనాలో చేనేత పట్టుచీర తయారీ ప్రదర్శన
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:14 AM
భారత్‌లో తయారయ్యే చేనేత పట్టు చీరలు నాణ్యతకు, కళాత్మకతకు చిహ్నంగా నిలుస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పట్టు చీరల తయారీని చైనాలో ప్రదర్శించారు.
ధర్మవరం, మార్చి 16 (ఆంద్రజ్యోతి): భారత్‌లో తయారయ్యే చేనేత పట్టు చీరలు నాణ్యతకు, కళాత్మకతకు చిహ్నంగా నిలుస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ పట్టు చీరల తయారీని చైనాలో ప్రదర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత వస్త్రాల డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత జూజురు నాగరాజు.. చైనాలోని బీజింగ్‌లో జరిగిన ‘వసంత్ మేళా’ సందర్భంగా మగ్గంపై పట్టు చీర తయారు చేసే విధానాన్ని ప్రదర్శించారు. మన దేశం నుంచి తీసుకెళ్లిన చిన్న చేనేత మగ్గంపై పట్టుచీరను నేసి.. అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులకు, కళాశాల అధ్యాపకులకు, చైనీయులకు చేనేత గురించి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర్మవరం పట్టు వస్త్రాలకు డిమాండ్ పెంచేందుకు ఈ ప్రదర్శన నిర్వహించామని నాగరాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ చేనేత సేవా కేంద్రం, హ్యాండ్‌లూమ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని వెల్లడించారు.